Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల సంఘాల ఆధ్వర్యంలో ఎక్సైజ్
- కార్యాలయం ముందు ఆందోళన
- అధికారులకు వినతి పత్రం అందజేసిన నాయకులు
నవతెలంగాన-కొత్తగూడెం
భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బినామీ మద్యం దుకాణం దారుల లైసెన్స్లు రద్దుచేయాలని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బాబుక్యాంపులోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదిగ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూసపాటి శ్రీనివాస్, గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర రావు గౌడ్, తుడుం దెబ్బ రాష్ట్ర ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ట దొర, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ కార్యాలయము ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి సంయుక్తంగా మాట్లాడుతూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో జిల్లా వ్యాప్తంగా దశలవారీగా నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హైకోర్టుకు వెళ్తామని ఉద్ఘాటించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వేలేటి వెంకటేశ్వర రావు, ఇనీగల మొగిలి, స్వామి, వేల్పుల భాస్కర్, కనకం సూరిబాబు, బెజ్జంకి సత్యనారాయణ, కత్తి బాలకృష్ణ, రాములు నాయక్, బత్తిని రాజశేఖర్, మహిళా నాయకురాలు కనుకుంట్ల నిర్మల, కృపా వేణి తదితరులు పాల్గొన్నారు.