Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఈఓకు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ పాల్వంచ సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక కేటీపీఎస్ కాలనీలో గల అభ్యుదయ ప్రైమరీ స్కూల్ నందు గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని యంఈఓ శ్రీరామ్ మూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ పట్టణ మండల కన్వీనర్ గూడెపూరి రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం పెట్టాలని ఆంక్షలు జారీ చేయటం కాదు చేతనైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేయాలని, వంట షెడ్లులేని పాఠశాలలుకు షెడ్లు నిర్మించి వంత పాత్రలు ఇవ్వాలని, కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల బిల్లులు వెంటనే చెల్లించకపోతే పాల్వంచ పట్టణం మండలంలో అధికంగా వంట బంద్ చేస్తామని అని వారు హెచ్చరించారు. ధర్నాకి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ ఇన్చార్జ్ కొట్టే నవీన్ సంఘీభావం తెలిపి సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటా మని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నాయకురాలు వై.రాధమ్మ ఆర్.పద్మ, కృష్ణవేణి, నాగమణి, లక్ష్మి, ధనలక్ష్మి, జ్యోతి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : నెలలు గడుస్తున్నా మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ యూనియన్ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, గోలెం లక్ష్మీ, జయమ్మ, ఉమా, సరిత, యాదమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం మద్యాహ్న భోజనం కార్మికుల సమస్యలుపై ఎంఈఓ కార్యాలయంలో విజరుకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. వెంకటమ్మ, జయ, అంజలి, దివ్య, సుగుణ పాల్గొన్నారు.