Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
సీపీఐ(ఎం) మండల నూతన కార్యదర్శిగా కొమరం కాంతారావును సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. మహాసభల విజయవంతానికి సహకరించిన మండల ప్రజానీకానికి, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. మండల కమిటీ సభ్యులుగా చర్పసత్యం, కనితి రామ్, బిలపాటి శంకరయ్య, కొమరం మలక్క, ఉకే నరసింహారావు, కొవాసి వెంకట్, తాటి సతీష్‌ను ఎన్నుకున్నారు.