Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ఖర్చు సమర్పించలేదని 96 మంది వార్డు సభ్యులు, ఏడుగురు ఉప సర్పంచ్‌లపై వేటు
- అనర్హులుగా ప్రకటించిన ఈసీ
నవతెలంగాణ-ములకలపల్లి
2019లో పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు మూడు నెలలోపు ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించకపో వడంతో 1 మండలానికి చెందిన 98 మంది వార్డుసభ్యులు, ఏడుగురు ఉపసర్పంచ్‌పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మండలంలో మొత్తం 20 పంచాయతీలకు గాను 180 వార్డులు ఉన్నాయి. ఇందులో రెండు పంచాయతీలు ఏకగ్రీవం కాగా 18 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. అయితే మండలంలో అభ్యర్ధులుగా ఉన్న 96 మంది మూడు నెలల వ్యవధిలో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషను అందజేయకపోవడంతో ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో వారంతా అనర్హులుగా మారారు అనర్హులుగా మారిన వారంతా 2024 సంవత్సరం ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా అనర్హులుగా ప్రకటించిన వారంతా ఎన్నికల ఖర్చుల వివరాలు సకాలంలోనే ఎంపీడీవో కార్యాలయంలో అందజేశామని, అయినా తమపై చర్యలు తీసుకోవడం ఏమిటని వార్డుసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఈవోఆర్డీగా విధులు నిర్వహించిన విజయభారతి, కంప్యూటర్ ఆపరేటర్ రజని, ఎన్నికల తర్వాత 15 రోజులకే ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఉదయభాస్కర్‌లు మృతి చెందడంతో ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించడంలో అయోమయం నెలకొన్నది. ఈ విషయంపై ప్రస్తుత ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావును 'నవతెలంగాణ' వివరణ కోరగా సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన విషయం వాస్తవమేనని, వారికి నోటీసులు సైతం అందించామని చెప్పడం కొసమెరుపు. అయితే అనర్హత వేటుపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వారుసభ్యులు చెబుతున్నారు.