Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
డిసెంబర్ 10న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వంత పార్టీ ఓటర్స్ను జాగ్రత్త చేసుకునే పనిని అధికార టిఆర్ఎస్ ప్రారంభించింది. సోమవారం గరుడ బస్లో ఎంపీటీసీ, జడ్పిటిసి, మునిసిపల్ కౌన్సిలర్స్ను తరలించింది. వైరా నియోజక వర్గంలో టిఆర్ఎస్ పార్టీకి 66 మంది ఉన్నారు. వీరిని గోవా తరలించేందుకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ నాయకత్వం లో కార్యక్రమం ప్రారంభం కాగా ఎంపీటీసీలు ఆరుగురు ఉండగా సోమవారం 5 గురు మాత్రమే బస్ ఎక్కారు. రెబ్బవరం ఎంపీటీసీ మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రాయల రమేష్ డుమ్మా కొట్టారు. వైరా మునిసిపల్ కౌన్సిలర్లలో 20 మందికి గాను 17 మంది టిఆర్ఎస్ పార్టీ వారే. 17 మందిలో బస్లో 8 మంది ఎక్కారు. మిగిలిన 9 మంది మరో నాలుగు రోజుల తర్వాత బయలు దేరే బస్లో వెళ్లవచ్చునని అంటున్నారు. ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉమెగ్రెన్ వైరస్ వార్తలతో భయపడుతున్నారు. మహిళా కౌన్సిలర్లలో ఎక్కువ మంది 12 రోజుల క్యాంపులో ఉండటానికి ఇష్టపడటం లేదు. వారితో పాటు వారి భర్తలకు కూడా క్యాంపు కెళ్ళే అవకాశం కల్పించినా, వారి బిజినెస్లు, చేతి వృత్తులకు నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు. కాగా అన్ని నష్టాలు పూడ్చు కోవచ్చులే వెళ్ళటమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాగా వైరా నియోజక వర్గం లో కాంగ్రెస్కు 13, సీపీఎంకు 5,. టీడిపి 1, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 87 మంది ఓటర్స్ ఉన్నారు.