Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దగ్గరుండి బస్సెక్కించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
డిసెంబరు 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు ఉన్న సత్తుపల్లి ప్రజా ప్రతినిధులు సోమవారం మధ్యాహ్నం గోవా క్యాంపు బయలుదేరి వెళ్లారు. సుమారు 90 మందికి పైగా వీరిని ఎమ్మెల్యే సండ్ర స్థానిక ఆర్టీసీ డిపో నుంచి రెండు రాజధాని బస్సులను అద్దెకు తీసుకుని దగ్గరుండి మరీ బస్సెక్కించి క్యాంపుకు సాగనంపారు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు ఈ క్యాంపుకు వెల్లిన వారిలో ఉన్నారు. వీరంతా హైదరాబాద్ చేరుకుని అక్కడ
ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కళాశాల నుంచి వేరే బస్సుల్లో గోవాకు బయలుదేరుతారని టీఆర్ఎస్ వార్గలు తెలిపాయి. వీరంతా పోలింగ్‌కు ఒకరోజు ముందు చేరుకుని ఇంటికి రాకుండానే ఓటుహక్కు వినియోగించుకున్న తరువాత ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్తారని ఆ వర్గాలు తెలిపాయి. క్యాంపుకు వెళ్తున్న ప్రజా ప్రతినిధుల్లో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఆ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్కే రఫీ, యాగంటి శ్రీనివాసరావు, దొడ్డా శంకరరావు, మల్లూరు అంకమరాజు, గాదె సత్యనారాయణ పాల్గొన్నారు.