Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
సీపీఐ(ఎం) సీనియర్ సభ్యులు గరిడేపల్లి పుల్లారావు సతీమణి చుక్కమ్మ కేన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. సోమవారం ఉదయం విప్పలమడక గ్రామంలో జరిగిన అంత్యక్రియలలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు, సీపీఎం గ్రామ కార్యదర్శి కొల్లా వెంకటేశ్వర్లు, పార్టీ సభ్యులు రుద్రాక్షల వేంకటాచారి, ఎదుల్ల పుల్లయ్య, మేడా సిరాబంది, ఇమ్మడి బాబురావు, గరిడేపల్లి మురళీ, గరిడేపల్లి సుబ్బారావు, ఎ.వేంకటేశ్వర్లు, ఇనపనూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తొలుత చుక్కమ్మ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి సంతాపం తెలిపారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొలికొండ వీరభద్రరావు, పంచాయతీ కార్యదర్శి వేము రామకృష్ణ, సొసైటీ సిఈఓ అక్కిసెట్టి రామకృష్ణ, ఆర్ఏంపిలు సత్యనారాయణ, ఉమాశంకర్, పార్టీ అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.