Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటు ప్రాంగణంలో జాతిపిత విగ్రహం వద్ద ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు
తొలిరోజున ఆందోళనలు, నిరసనలతో ఇరుకున పడ్డ బీజేపీ
నవతెలంగాణ-ఖమ్మం
పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడంతో పార్లమెంటు దద్దరిల్లింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా పార్లమెంటు లోపల, బయటా టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పార్లమెంటు ప్రాంగణంలో నినాదాలు మిన్నంటాయి. పార్లమెంటు ప్రాంగణంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు ప్ల కార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తొలిరోజే ప్రశ్నోత్తరాల సమయం మొదలు కాగానే ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో తెరాస ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీ నామ నాగేశ్వరరావు నేతత్వంలో తెరాస సభ్యులు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ బిర్లా సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం లోక్‌సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు రైతు బిల్లు, ధాన్యం కొనుగోళ్లపై చర్చకు పట్టుపట్టడంతో సభలో మరోమారు గందరగోళం నెలకొంది. దీంతో ప్యానల్ స్పీకర్ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు.