Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న ఒక రూపాయికి కిలో రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్లు కిలో పది రూపాయలకు కొనుగోలు చేసి అక్రమ మార్గంలో తరలిస్తున్నారని ప్రజలు విమ ర్శిస్తున్నారు. ఆ క్రమంలో ప్రజలు ఇచ్చే పక్కా సమాచారంతో అక్రమ మార్గంలో తరలి వెళ్తు న్న రేషన్ బియ్యాన్ని అధికారులు దాడి చేసి పలుమార్లు పట్టుకుంటున్నా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా వ్యాపారం కొనసాగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బియ్యాన్ని ఆంధ్రాకు తరలించి అక్రమార్జనకు పాలు పడుతున్నారని ప్రజలు తెలుపుతున్నారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఎర్రుపాలెం ఎస్సై మేడా ప్రసాద్ నిర్వహించిన పెట్రోలింగ్‌లో అనుమానాస్పదంగా ఉన్న రెండు ఆటోలను తనిఖీ చేయగా రేషన్ బియ్యాన్ని ఆంధ్రాకు సరఫరా చేస్తున్నట్లు తేలడంతో మూడు ఆటోలను ఎస్సై స్టేషన్ కు తరలించి ఆటో ఓనర్లపై 6ఏ కేసు నమోదు చేసి సివిల్ సప్లై డిటి రామచంద్రరావుకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.