Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని
అ ఓటరుగా నమోదు చేయాలి
అ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహనకు ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం నూతన ఓటర్లు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, గరుడ యాప్ వినియోగం తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఉన్న డిగ్రీ కళాశాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను బిఎల్ఓ సహాయంతో జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ స్వర్ణలత, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాజు, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.