Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
సిపిఐ(ఎం) పార్టీ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు నవంబరు 29, 30 రేండు రోజుల పాటు ఖమ్మం నగరంలో జరిగినవి. ఈ మహాసభలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైరా మండలం కోష్టాల గ్రామం నివాసి అయిన సుంకర సుధాకర్ 2000 సంవత్సరం నుండి నేటి వరకు సిపిఐ(ఎం) పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా కొనసాగుతున్నారు. సిపిఐ (ఎం) పార్టీ వైరా డివిజన్ కమిటీ సభ్యునిగా, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యునిగా నిబద్ధతతో పనిచేశారు. 2014 నుండి నేటి వరకు మూడు పర్యాయాలు వైరా పట్టణ కార్యదర్శిగా సుంకర సుధాకర్ పనిచేస్తున్నారు. వైరా పట్టణ కార్యదర్శిగా పార్టీ పునాదిని, ప్రతిష్టను మరింత పెంచడానికి అనేక ఆటంకాలు, అవరోధాలను అధిగమించి సిపిఐ(ఎం) పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కషి చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ మాట్లాడుతూ పార్టీ ఆశయాల సాధనకు కృషి చేస్తానని, పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, చివరి వరకు పార్టీ పట్ల విశ్వాసంతో బాధ్యత, క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలుగా పని చేస్తానన్నారు.