Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ప్రాణాంతకంగా మహమ్మారి వ్యాధి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు బండి సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్ల నందు ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నిర్వహించడం జరిగింది. తరువాత అందరూ కలిసి కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి చర్ల వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు. తర్వాత అంబేద్కర్ సెంటర్ వద్ద ఎన్ఎస్ఎస్ పి.వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి యువకులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని, తెలిసి తెలియని వయసు వల్ల, తొందరపాటు చర్య వల్ల, ఆలోచించేంత వయసు లేకపోవడంతో ఎయిడ్స్ పై అవగాహన లేకపోవడం, యువతీ యువకులు ఎయిడ్స్ కోరల్లో చిక్కుకుంటున్నారని అన్నారు. అలాగే ఈ ఎయిడ్స్ వ్యాధి మనకు తెలియకుండానే చాపకింద నీరులా వ్యాపిస్తుందని చెప్పారు. యుక్త వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యకరమైన భారతదేశ పౌరులుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన భారతదేశాన్ని తయారు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బండి సత్యనారాయణ, సీనియర్ అధ్యాపకులు శెట్టి ప్రసాద్, కొండలరావు, ఏసోబు, జాన్ వెస్లీ, నందికొండ వెంకన్న, దీపా, అమృత రావు, హరీష్ సుధాకర్, వీరభద్రం, ప్రభాకర్, బింగి రమేష్, కష్ణ, సాంబశివరావు, వీర్రాజు, సంజీవరెడ్డి అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దుమ్ముగూడెం : ఎయిడ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని దుమ్ముగూడెం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యం.శ్రీనివాసరావు, డి.రామకృష్ణ, పి.వినరు కుమార్, ఏ.శ్రీనివాసరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి
పినపాక : ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పినపాక, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు శివకుమార్, వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పినపాక హెల్త్ సెంటర్ నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ బయ్యారం క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ కుమార్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, బలవర్థకమైన ఆహారం తినడంతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు : ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని డాక్టరు పావని తెలిపారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్బంగా శివలింగాపురం పిహెచ్సిలో ఆమె మాట్లాడుతూ అసమానతలను అంతం చేద్దాం, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలిద్దామన్నారు. సుఖ వ్యాధులతో జీరో అవుతారా, కండోమ్స్‌తో హీరోలు అవుతారా అని హితవు పలికారు. సురక్షిత శృంగారం వలన జీవితం బంగారం అవుతుందన్నారు. హెచ్ఐవి రోగిని ఆదరిద్దాం..హెచ్ఐవిని తరమికొడదాం అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : సమాజంలో ఎయిడ్స్ నిర్మూలన ఒక బాధ్యతగా చేపట్టాలని ప్రభుత్వ కళాశాల ప్రిన్స్‌పాల్ శ్రీరంగం రామలింగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ 14 నెంబర్ బస్తీ, కొత్త కాలనీ, వెంగళరావు కాలనీ మీదిగా, జగదాంబ సెంటర్ వరకు సాగింది. ఎయిడ్స్ నిర్మూలన అందరి బాధ్యతని, నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్లెకార్డులు ప్రదర్శిస్తూ నినదించారు. అనంతరం ప్రిన్సిపాల్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత దేశంగా దేశంగా తయారు చేయడానికి విద్యార్థులు కృషి అవసరం అన్నారు. అవగాహన సదస్సులు, ప్రచారాలు, వివిధ కార్యక్రమాలు చేయడం వల్లనే చాలావరకు ఎయిడ్స్ తగ్గుముఖం పట్టిదని అన్నారు. ర్యాలీలు ప్రజలను చైతన్యం చేయడానికి ఎంతో ఉపయోగపతాయని అన్నారు. వాలంటీర్లు సొంత తమ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలకు వివిధ రుగ్మతల మరియు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోర్తి జాన్, ఖాసీం సార్, మరో పిఓ విలియం ప్రసాద్, జగన్ మరియు అధ్యాపక అద్యపాకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం
మండల వైద్యాధికారి రవిచంద్
గుండాల : ఎయిడ్స్ రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మండల వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ అన్నారు.ఆజాద్ అమృత్ మహౌత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ, మానవహారం నిర్వహించి ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులలో వైరస్ లక్షణాలు సంక్రమించే విధానం గురించి తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ ప్రతిరోజు ఫిట్ నెస్ ఎక్సర్ సైజులు చేస్తూ ఇమ్యూనిటీని పెంచుకోవాలని, నివారణ కోసం మాస్క్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్భాగాందీ కళాశాల ప్రిన్సిపాల్, టీచర్స్, విద్యార్థులు, వివేకావర్ధిని కళాశాల విద్యార్థులు, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీహరి, పద్మ, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, మలేరియా సూపర్ వైజర్ సత్యం, ఆశ కార్యకర్త లు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి....నిర్మూలన చేయాలి
కొత్తగూడెం : ఎయిడ్స్ వ్యాధిపై నేటితరం యువత అవగాహన పెంచుకోవాలని, దాని నిర్మూలనకు కృషి చేయాలని డాక్టర్ నిస్పీ శారోస్ అన్నారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం ఆధ్వర్యంలో బూడిదగడ్డలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ''ఆజాది కా అమ్రిత్ మహౌత్సవ్'' కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నిస్సి శారోన్ ఎయిడ్స్ పై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇంచార్జ్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ పొన్నెకంటి సంజీవరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వర రావు, ఉపాధ్యాయులు కుమార్, పద్మావతి, పిఇటి. ధర్మమ్మ, ఎఎన్ఎం.ఉమ, ఆశా కార్యకర్తలు శారద, సుజాత, శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.