Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుమ్ముగూడెం : మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామానికి చెందిన కొత్తూరి మస్తాన్ రావు కుటుంబ సభ్యులను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం పరామర్శించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆఖరి క్షణం వరకు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా కాలాన్ని గడిపిన కొత్తూరి మస్తాన్ రావు మృతి వార్త తనను కలిచి వేసిందని, ఆయన కుటుంబానికి అనుక్షణం అండగా ఉంటానని ఎమ్మెల్యే మస్తాన్రావు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. మస్తాన్ రావు మృతి చెందిన వార్త తెలిసినప్పటికీ అందుబాటులో లేకపోవడం వలన హాజరు కాలేక పోయానని ఎమ్మెల్యే తెలిపారు. పరామర్శించిన వారిలో టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ తరుణ్ మిత్ర, మండల అధ్యక్షులు లంకా అబ్బులు, మాజీ అధ్యక్షులు బైరెడ్డి సీతారామారావు, పిలకా వెంకట రమణారెడ్డి, లంకా ప్రసాద్, తాళ్ళపూడి శేఖర్, కర్రి రవీందర్ కుమార్ తదితరులున్నారు.