Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం నేత భూక్యా రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న, బీజేపీ విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం నేత భూక్యా రమేష్ ప్రజలకి పిలుపు ఇచ్చారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజేపి మతోన్మాదంపై ప్రజలు అందరూ ఏకం కావాలని రమేశ్ అన్నారు. స్థానిక హనుమాన్ బస్తీ సీపీఎం పార్టీ కమిటీ అధ్వర్యంలో బుధవారం మైనార్టీలపై దాడులు ఖండిస్తూ, బీజేపీ విధానాలపై నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూక్యా రమేష్ మాట్లాడుతూ. ముస్లిం, క్రిష్టియన్ల పై హిందూ మతం పేరుతో ప్రజలను హింసిస్తూ ఉన్మాదాన్ని సృష్టిస్తున్న బీజేపీ పై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ప్రజల ఐక్యతతో దాడులని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎన్ఎస్.రాజు, భూక్యా బాబు, సురం ఐలయ్య, వై.వేంకటేశ్వర్లు, సుశీల, నాగేందర్, సాంబశివరావు, రామకృష్ణ, శేఖర్, నగేష్, సంస్కృతి, తత్వేదిక, తద్వీపిక, పండు తదితరులు పాల్గొన్నారు.