Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐద్వా డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 13వ వార్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కి యు.జ్యోతి అధ్యక్షతన వహించగా ఐద్వా పట్టణ అధ్యక్షురాలు డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హింసలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. హత్యలు, మానభంగాలు పెరగడానికి ప్రభుత్వాలు కారణమన్నారని ఆమె అన్నారు. హింస నుండి బాలికలకు, మహిళలను రక్షించాలంటే ప్రభుత్వం బెల్ట్ షాపులను, మాదక ద్రవ్యాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఒక మహిళ చైతన్యవంతులు కావాలని, ఐద్వా ఇచ్చే ప్రతి పిలుపులో భాగస్వాములు కావాలని అన్నారు. అలాగే ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు బి.కుసుమ మాట్లాడుతూ ప్రతి కుటుంబం లో అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా చూడాలని అన్నారు. ఈ సెమినార్లో ఆఫీస్ బేరర్ జీవన జ్యోతి, సి.హెచ్. రమణ, సత్యవతి, సుధ, రమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.