Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ శాస్త్రవేత్త హేమంత కుమార్
నవతెలంగాణ-ముదిగొండ
మిరపతోటలో ఎర్రనల్లి, నల్ల తామరపురుగు నివారణకు నీలిరంగు అట్టాలను ఏర్పాటు చేసుకోవాలని వైరా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త హేమంత్ కుమార్ రైతులకు సూచించారు. మిరపతోటలో పూత, కాత పురుగు ఉధృతిపై ముదిగొండ రైతువేదికలో బుధవారం రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరపతోటలో సర్వరోగ నివారిణి నీలిరంగు అట్టాలు రైతులు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. అనంతరం వెంకటాపురం గ్రామానికి చెందిన బెజవాడ వంశి అనే రైతు మిరపతోటను సందర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కిరణ్ కుమార్, భాస్కర్,రాజ్ కుమార్, మాధవిరెడ్డి, శ్రీధర్, కృష్ణారెడ్డి, రచన, అనితకుమారి, సిద్దిక్, రవి చైతన్య, శివ రైతు సమన్వయసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,మధిర ఏడిఏ కొంగర వెంకటేశ్వరరావు,మండల వ్యవసాయాధికారి మందుల రాధ,ఉద్యానవన అధికారులు వేణు, అపర్ణ, ఏఈఓలు ఏ మౌనిక, దివ్యమనీషా, ఇందుభవాని, లికిత, బిటీఎం రమేష్, రైతుబంధు సభ్యులు,పలువురు రైతులు పాల్గొన్నారు.