Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జేసీ మధుసూదన్‌రావు ఆదేశించారు. బుధవారం పుల్లయ్య బంజర సమిపంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని జాయింటు కలెక్టర్ మదుసుదనరావు, పరిశీలించారు. ఇప్పటి వరకు 5230 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఏపిఎం వెంకటరామారావు జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. సందర్భంగా తేమశాతాన్ని పరిశీలించారు ఎఫ్ సి ఐ నిబంధనల ప్రకారం లేకపోతే వెంటనే తుర్పా పోయటం దాన్యం శుభ్రం చేయంచి కాటాలు ముమ్మరం చేయ్యలని అదేశించారు. ఈ సందర్బంగా రైతులు సొసైటీ మాజీ చైర్మన్ పెద్ద బొయిన మల్లేశ్వరావు రబీలో వరి సాగు చేయాలా వద్దా మా భూముల్లో వరి తప్ప వేరే ఏ పంట పండిందని అందుకే వరి సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని రైతులు కోరారు. దీంతో అది ప్రభుత్వ పాలసీ మేటర్ని ఆయన రైతులకు సమాధానం చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిందని బట్టే సాగు చేయాలని అన్నారు.ఆర్డీవో సీహెచ్ సూర్యనారాయణ, డీఆర్డీఏ ఏపీడీ రావుల జయశ్రీ, డిపిఎం దర్గయ్య, మండల ప్రత్యేకాధికారి సునీత, తహసీల్దార్ మంగీలాల్, ఎండీఓ టి.శ్రీనివాసరావు , ఏవో ఎం.రూప, ఏపీఓ హేమామాలిని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.