Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో పటా పంచల శ్రీనివాసరావు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు బీమా నగదును పెద్ద గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు శీలం అక్కిరెడ్డి అందజేశారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండి ఇటీవల మరణించడంతో బీమా నగదును 50,000 వేల రూపాయలును అతని భార్య పటాపంచల ధనలక్ష్మికి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి బ్యాంకు మేనేజర్ వీరభద్రం, సిఈఓ వీరారెడ్డి, సొసైటీ సిబ్బంది ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.