Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీల్‌దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు నిషేదిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసినవ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడరు. చర్ల మండలం కొండవాయి గ్రామానికి చెందిన నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన గ్రామ కమిటీ సభ్యులు, ఇద్దరు మిలీషియా సభ్యులు లొంగిపోయారన్నారు. గ్రామ కమిటీ సభ్యులు దూధి గంగ, పొడియం ఆదమయ్య, ముస్కి కోసయ్య, పొడియం రాజే, మిలీషియా సభ్యుడు సోడి గంగి లొంగిపోయారని తెలిపారు. 5 మంది సభ్యులు నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) పార్టీకి గ్రామ కమిటీ సభ్యులుగా, మిలీషియా సభ్యులుగా గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని తెలిపారు. చర్ల ప్రాంతంలో సాధారణ కమ్యూనిటీ పోలీసింగ్‌తో గ్రామస్తులు, వారి బంధువులు వారిని పోలీసుల ముందు లొంగిపోయేలా ఒప్పించారని వివరించారు.