Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
చిరస్మరణీయుడు, ప్రజావైద్యులుగా గుర్తింపు పొంది ఎదిగిన డాక్టర్ బుగ్గవీటి నరసింహారావు అని బుగ్గవీటి చెవి, ముక్కు, గొంతు, హెడ్ అండ్ నెక్, క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు జి.హరిప్రసాద్, బుగ్గవీటి రాహుల్ అన్నారు. గురువారం ఖమ్మంలోని ఆస్పత్రిలోని బుగ్గ వీటి నరసింహారావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కృష్ణా జిల్లాల ప్రజానీకానికి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చక్కని వైద్యాన్ని అందిస్తూ, ప్రజల మన్ననలు పొందారన్నారు. బుగ్గవీటి చెవి, ముక్కు, గొంతు హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బుగ్గవీటి నరసింహారావు గత ఏడాది డిసెంబర్ 2న తుదిశ్వాస వీడవడం బాధాకరమైన విషయం అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా హాస్పిటల్‌ను నడిపిస్తూ వారి సారథ్యంలో వైద్య సేవలు అందించిన సీనియర్ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ జి. హరిప్రసాద్, ప్రతి రోజు మా బుగ్గవీటి హాస్పిటల్లో అదే స్థాయిలో వైద్య సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుచున్నారనారు. ప్రతీ నెలా మొదటి, మూడవ గురువారంలలో డాక్టర్ బుగ్గవీటి నరసింహారావు కుమారుడు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, డాక్టర్ రాహూల్ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం కోరారు.
తమ ఆస్పత్రిలో కోత కుట్లు లేకుండా జర్మనీ ఎండోస్కోపి ద్వారా చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్ చేయబడతాయి, చెవి మైక్రో సర్జరీ, ముక్కు దూలం వంకర, అడ్వాన్సెడ్ సైనస్ సర్జరీ, కుతికలు, ఎండోస్కోపి డిసిఆర్ సర్జరీ, గొంతు బొంగురుగా రావటం, థైరాయిడ్ ఆపరేషన్, మైక్రో డి బ్రెడర్ పాలిప్ ఆపరేషన్, ఉమ్మి గ్రంధి ఆపరేషన్, పెరోటిడ్ గాండ్ ఆపరేషన్, హెమి థైరాయిడ్ ఆపరేషన్, టాన్స్ లెక్టమి, ఎడినొయిడ్క్టమి, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఆపరేషన్, థైరాయిడ్ క్యాన్సర్ వంటి ఆపరేషన్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం ఆస్పత్రిలో సుమారు 200 మందికి ఉచిత ఓపి చూశామని తెలిపారు.
మంచికి మారుపేరు బుగ్గ వీటి : ఎస్.కె హిమామ్ పాషా గోకినేనిపల్లి
బుగ్గవీటి హాస్పిటల్లో తమకు ఉచితంగా ముక్కుకు ఆపరేషన్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సుమారు 40 వేల రూపాయలు ఆపరేషన్ చేయడం వారి మంచితనానికి మారుపేరు. తాము కూలి పనులు చేసుకుని జీవన్ గడుపుతున్నామని, తమకు ఎంతో ఖర్చుతో కూడిన ఆపరేషన్ ఉచితంగా చేసి తమ ప్రాణాలు కాపాడిన దేవుడన్నారు.
పునర్జన్మ నిచ్చారు : ఎస్కె నూర్జహాన్, గువ్వల గూడెం
ముక్కు కండ పెరగడంతో బయట హాస్పిటల్ లో సుమారు 30 నుంచి 40 వేలు ఖర్చవుతుంది తెలిపారు. తమ గ్రామ పెద్దల సహకారంతో హాస్పిటల్లో సంప్రదించగా ఉచితంగా చేస్తామని తెలిపారని ఎంతో ఆనందపడ్డాను. మా లాంటి పేదలకు ఇలా ఆపరేషన్ ఉచితంగా చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వర్ధంతి వేడుకలు
నగరంలోని ఎన్ఎస్పీ క్యాంప్‌లో గల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ట్రస్టు సభ్యులు బుగ్గ వీటి నరసింహారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు బుగ్గ వీటి శ్రీధర్, కూరపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీవన సంధ్య వృద్ధాశ్రమం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నరసింహారావు అకాల మరణం తనను ఎంతగానో కలిచి వేసింది అన్నారు. 20 సంవత్సరాల క్రితం నరసింహారావు ప్రత్యేక కృషితో జిల్లా కలెక్టర్ గిరిధర్ సహకారంతో ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తన జీవిత కాలంలో ఆయన వృద్ధాశ్రమం అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. నరసింహారావు సతీమణి సరళ మాట్లాడుతూ అభ్యుదయ భావాలు గొప్ప సేవ నీతి కలిగిన ఆయన నా సతీమణి కావడం తన అదృష్టమని తన భర్త ప్రోత్సాహంతో ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, తాను పదేళ్లపాటు సర్పంచ్ గా నిస్వార్థ సేవలు అందించానని, తన భర్త ప్రోత్సాహం సహకారం చాలా ముఖ్యమైనవి గుర్తు చేశారు. వెన్నుతట్టి ప్రోత్సహించారే, తప్ప ఏనాడూ తాను సర్పంచిగా పనిచేసిన పదేళ్లలో జోక్యం చేసుకోలేదని డాక్టర్‌గా ఉత్తమ వైద్య సేవలు ప్రజలకు అందిస్తూ పేదల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు పొందారని అన్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో లో ట్రస్టు సభ్యులు బుగ్గ వీటి కోటేశ్వరావు, రమేష్, డాక్టర్ నరసింహారావు కుటుంబ సభ్యులు, బంధువులు హైమావతి, వనజ ఝాన్సీ కోదాడ గిరి దేవేంద్ర వల్లభనేని రామారావు నవీన్ తిరుపతిరావు సత్తెనపల్లి శీను తదితరులు పాల్గొన్నారు.