Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీజేపీ,టీఆర్ఎస్ ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాలి
అ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ-చింతకాని
రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం పంటను కొనుగోలు చేయకుండ, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ దొంగ నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. గురువారం చింతకాని పార్టీ మండల కమిటీ సమావేశంలో పోతినేని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో దోబూచులాడుతూ, ఒకరిపై ఒకరు దొంగ ధర్నాలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేయకుండా దొంగ నాటకాలాడుతున్నారని విమర్శించారు. తక్షణమే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూమి సాగు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, వత్సవాయి జానకిరాములు, తోటకూరి వెంకటనర్సయ్య, రాచబంటి రాము, మద్దిన్ని బసవయ్య, బల్లి వీరయ్య, గడ్డం రమణ, నన్నక కృష్ణమూర్తి,గంటెల సామిదాసు, పులి యజ్ఞనారాయణ, ఆలస్యం రవి, బత్తుల అరుణ పాల్గొన్నారు.