Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు వెన్నపూస కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఆ సంఘం పరిధిలోని వెంకటాపురం, నరసింహపురం గ్రామాలలో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేమశాతం రాకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రాలను రైతు లందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, వెంకటాపురం, రాజుపాలెం, గ్రామ పంచాయతీల సర్పంచులు బొగ్గుల లక్ష్మి, బూసిపల్లి వెంకట రెడ్డి, ఎంపీటీసీ సభ్యు లు దొమందుల సామేలు, ఎర్రుపాలెం మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకటరామి రెడ్డి, ఏఈవో జిష్ణు, సంఘం సీఈవో శివారెడ్డి, రైతులు, సొసైటీ డైరెక్టర్లు, సంఘం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.