Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పెంట్యాల మల్లయ్య(87) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య 20 ఏళ్ల క్రితం బోనకల్ మండల పరిధిలోని జానకిపురం వచ్చి స్థిరపడ్డారు. రెండు వేల సంవత్సరం వరకు మల్లయ్య కృష్ణాజిల్లా జగ్గయ్య పేట డివిజన్ పరిధిలో చురుకైన పాత్ర నిర్వహించాడు. పార్టీయో ప్రాణంగా మిలిటెంట్ గా పని చేశాడు. 1978 సంవత్సరంలో జగ్గయ్య పేట డివిజన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాలలోను, రాజకీయ ఘర్షణలలో జైలుకు వెళ్లి మూడు నెలల పాటు ఉన్నారు. జగ్గయ్య పేట డివిజన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ప్రాణం కంటే పార్టీ మిన్నగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. రాజకీయంగా, ప్రజా పోరాటాల సందర్భంగా మల్లయ్య పై అనేక కేసులు నమోదయ్యాయి. తన స్వగ్రామమైన పొలంపల్లిలో పార్టీ బలంగా నిర్మాణం చేయటం లో మల్లయ్య పాత్ర మరువలేనిది. కుటుంబ అవసరాల నిమిత్తం 1998లో కుటుంబంతో జానకిపురం వచ్చి స్థిరపడ్డారు. జానకిపురం సిపిఎం శాఖ కార్యదర్శిగా మూడు సార్లు పని చేశారు. వయసు మీదపడుతున్నా పార్టీపై అచంచల విశ్వాసంతో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. గత కొంత కాలంగా స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం జగ్గయ్యపేట డివిజన్ మాజీ కార్యదర్శి చిరుమామిళ్ళ హనుమంతరావు, వత్సవాయి మండల కార్యదర్శి తమ్మినేని రమేష్, మాజీ మండల కార్యదర్శి మండెపూడి చంద్రశేఖర్, సిపిఎం సీనియర్ నాయకులు యనమద్ది సత్యనారాయణ, సిపిఎం నాయకులు చల్లగుండ్ల రామనర్సయ్య, ఆళ్ల ప్రసాద్, మాదినేని నరసింహారావు, పారా లక్ష్మీనారాయణ, చలమల హరి కిషన్ రావు, షేక్ నాగుల్ మీరా తదితరులు నివాళులు అర్పించారు.
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మృతి
నవతెలంగాణ-వేంసూరు
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, శతవృద్ధుడు బేతిని సూర్యనారాయణ(100) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. భౌతిక కాయాన్ని పార్టీ నాయకులు అరవపల్లి గోపాల్ రావు, జగన్ మోహన్ రావులు పార్టీ జెండాలు కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని అన్నారు. మోరంపూడి వెంకటేశ్వరరావు, కొత్త సత్యనారాయణ, రావుల రాజబాబు, కృష్ణారావు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.