Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు ప్రభుత్వాన్ని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ నుంచి ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రావూరి రాధికకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త భవన నిర్మాణ కార్మికుల సమ్మెలో భాగంగా బోనకల్లు మండలం లో భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టాన్ని, 1979 వలస కార్మికుల చట్టాన్ని రక్షించుకోవడానికి, వెల్ఫేర్ బోర్డ్ లో పెండింగ్ లో ఉన్న 36 వేల కేసులు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అడ్డాలకు స్థలాలు కేటాయించి, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాలు నిండిన భవన కార్మికులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద భీమా నష్టపరిహారాన్ని ఆరు నుంచి పది లక్షలకు పెంచాలని, అలాగే సాధారణ మరణానికి లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రసూతి కానుక, వివాహం ఒక లక్ష రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర మల్లికార్జున్ బోనకల్ మండల కార్యదర్శి బోయినపల్లి వీరబాబు సిఐటియు నాయకులు మందడపు శ్రీనివాసరావు, షేక్ ఖాదర్ బాబా, షేక్ మీరా, గోవిందు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై తహశీల్దార్ కి వినతి - సిఐటియు
తిరుమలాయపాలెం : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ దొడ్డే పుల్లయ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ వస పొంగు వీరన్న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తునట్లు తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకుల ధరలు విపరీతంగా పెంచటంతో సామాన్య ప్రజలు బిల్డర్స్ పనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య, బిల్లింగ్ మండల నాయకులు గుండమల్ల ఉపేందర్, కోడి లింగయ్య ఎస్.కె ఇమామ్, పీ నగేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రూరల్ తహసీల్దార్ కు సీఐటీయూ వినతి
ఖమ్మం రూరల్: బిల్డింగ్ ఆధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటియు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఖమ్మం రూరల్ లో మొదటిరోజు సమ్మె ప్రారంభం ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం రూరల్ తహసీల్దార్ కారుమంచి శ్రీనివాసరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళ పల్లి మోహన్ రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సంవత్సరంలో 365 పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణానికి అవసరమయ్యే ముడిసరుకుల ధరలు పెంచిన కారణంగా పనులు నిలిచాయని అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు దోనోజు లక్ష్మయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ మండల కన్వీనర్ మేడికొండ నాగేశ్వరరావు, జిల్లా నాయకులు జగం నగేష్ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు దోనోజు పాపా చారి, మండల నాయకులు పూరెళ్లి చిన్న రాములు, గండి నాగయ్య, సిఐటియు మండల నాయకులు ఏర్పుల శ్రీనివాసరావు, యాకూబ్ మియా తదితరులు పాల్గొన్నారు.