Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ప్రచారోద్యమంలో సీఐ అంజలి
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో లింగ సమానత్యం అనే అంశంపైన విద్యార్థినులకు అవగాహన సమావేశం, చర్చా వేదికను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధానాచారులు కే.ఎస్.పీ.రారు అధ్యక్షోపన్యాసం చేస్తూ విద్య ద్వారా స్త్రీలు లింగ అసమానత్యంపై శక్తివంతమైన పోరాటం చేయగలరని ఉద్భోదించారు. సమాజంలోని సాంప్రదాయవాదుల ఆలోచనా దృక్పథాన్ని మార్చడం ద్వారా మాత్రమే తిరిగి అసమానత్యాన్ని రూపు మార్చగలమని తెలియజేసారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజలి మాట్లాడుతూ విద్యార్థినులు కూడా విద్యార్థులతో సమానంగా తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకుంటూ 'మేము ఎవరికీ తక్కువ కాము', 'ఆకాశమే మాకు 'హద్దు' అన్నట్లు విజయ తీరాలవైపు దూసుకెళ్ళాలని ప్రోత్సహించారు. విద్యార్థినులకు తాము సంపూర్ణ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దళిత స్త్రీ శక్తి బాధ్యులు అయిన కె. విజయలక్ష్మి మాట్లాడుతూ విద్య, విజ్ఞానం, వివేకం, శాస్త్రీయ దృక్పధం పెంచుకోవటం ద్వారా మాత్రమే రాణించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధాపకులు నీరజ, శంకర్, పద్మలత, మార్జియానా, పర్వీన్, సకినా బానో, ఎం. వేణు, రాధిక పాల్గొన్నారు.