Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని లింగాల గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మర్టూరి భద్రయ్యను డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు గురువారం వారికి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా లింగాల గ్రామం టీఆర్ఎస్ నాయకులు దేవరపల్లి వెంకటేశ్వరరావు కుమార్తె వివాహం ఇటీవల జరగ్గా నూతన దంపతులను ఆశీర్వాధించారు. అనంతరం యర్రబోయినపల్లి గ్రామాల బీరవల్లి లక్ష్మి దేవి మృతి చెందటంతో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగప్రసాదు, హనుమంత వెంకటనర్సయ్య, టూర్ పుల్లయ్య, ఏనుగు సత్యంబాబు, తదితరులు పాల్గొన్నారు.