Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి, ఆదివాసి మహిళ సుధారాణి కారేపల్లి మండలంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీలో ఉన్న సుధారాణి ఎంపీటీసీ, జడ్పీటీసీల ఇండ్లకు వెళ్ళి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ఆదివాసీలకు న్యాయం జరగాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగినట్లు పేర్కొన్నారు. ఆదివాసీలు అస్ధిత్వం కోసం పోరాడాల్సిన స్ధితిని పాలకులు తీసుకవచ్చారని విమర్శించారు. ఏజన్సీ ప్రాంతాల అభివృద్ధి, చట్టాల అమలే లక్ష్యంగా పని చేస్తాన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ జోడా కబుర్లు అందించటం ద్వారా ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సొసైటీ సభ్యులు కుర్సం సీతారాములు, ముక్తి భాస్కర్, తుడుందెబ్బ నాయకులు రాంప్రసాద్, వీసాల రాంబాబు, పొదెం రాంమ్మూర్తి పులసం భద్రం, పూనెం శివరాం పాల్గొన్నారు.