Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముదిగొండ
రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ల నుండి ఆసరా పెన్షన్ లు మంజూరు చేయడం లేదని సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో మండలపరిధిలో చిరుమర్రి గ్రామంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల నాయకులు కోలేటి ఉపేందర్ మాట్లాడుతూ ఆసరా పెన్షన్ లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి సామినేని రామారావు, నాయకులు చావగాని మాధవరావు, వినుకొండ రాణి, కత్రం గురవయ్య,దోమల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.