Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఖమ్మం
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుగా నూతనంగా షేక్ బషీరుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ 21 వ జిల్లా మహాసభలు స్థానిక ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఎంబి గార్డెన్స్ లో నవంబర్ 29, 30 తేదీల్లో ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో షేక్ బషీరుద్దీన్ను జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నిక పట్ల పలువురు పెద్దలు అభినందనలు తెలియజేశారు. విద్యార్థి రంగంలో జిల్లా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర నాయకులుగా పనిచేసి, కార్మిక రంగంలో పాలేరు డివిజన్ అధ్యక్షుడిగా పని చేసిన బషీరుద్దీన్ ప్రస్తుతం యువజన రంగం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన బాధ్యతను మరింతగా కష్టపడి పార్టీ పెరుగుదలకు చేస్తానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరింత కష్టపడి పనిచేస్తామని, విద్యార్థి యువజన కార్మిక రంగంలో పనిచేసిన అనుభవంతో పార్టీలో కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి కుంటానని సిద్ధం అవుతానని అన్నారు. ఈ పనిలో అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకాలం అనేక పోరాటాలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.