Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదివాసీ గిరిజన సంఘం
నవతెలంగాణ-కారేపల్లి
ప్రేమ పేరుతో ఆదివాసి బాలికను వంచించి ఆత్మహత్యకు కారకుడైన తారాచంద్ను కఠినంగా శిక్షించాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు వజ్జా రామారావు, దుగ్గి కృష్ణలు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం ఎర్రబోడులో ప్రేమించి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబాన్ని వారు పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమాయక ఆడ పిల్లలను ప్రేమపేరుతో వంచించటం నిత్యం జరుగుతున్నాయని వీటిని కట్టడికి పోలీసులు కఠిన వ్యవహరించాలని కోరారు. మైనర్ బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.