Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-తల్లాడ
కొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు గదుల మంజూరుకు కృషి చేస్తానని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హామీ ఇచ్చారు. గురువారం కుర్నవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్నారై ఎర్రం శ్రీనివాస్ రెడ్డి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఏలూరు లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాలు అందజేశారు. ఈ కార్యక్రమాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.వీర మోహన్ రెడ్డి, నాయకులు డి.వెంకట్ లాల్, దిరిశాల దాసు రావు, దూపాటి భద్రరాజు, బొడ్డు వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కళావతి, ప్రధానోపాధ్యాయుడు శీలం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.