Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని, అనేక రుగ్మతలు దరిచేరకుండా చేస్తుందనియోగా గురువు గుమలపురం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం ఆధ్వర్యంలో పాత కొత్తగూడెంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళల డిగ్రీ కళాశాల నందు 'ఆజాదీ కా అమ్రిత్ మహౌత్సవ్'' కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఇంచార్జ్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ పొన్నెకంటి సంజీవరాజు ఆధ్వర్యంలో విద్యార్థినిలకు యోగ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆజాదీ కా అమ్రిత్ మహౌత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కళాశాలలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు.
అనంతరం విద్యార్థినిలతో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నిస్సీ శారోన్, ప్రిన్సిపల్ రాజేశ్వరి, ఎఎన్ఎం. కమల, స్టాఫ్ నర్స్ పార్వతి, ఆశాలు ప్రమీల, శారద, సుజాత, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.