Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాలనీ వాసుల ఇబ్బందులు
తెలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గౌరిగూడెం పంచాయతీ పరిధిలో రెండేండ్ల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ సముదాయానికి రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ కాలనీ సందర్శనకు వెళ్లిన శ్రీనివాస్‌కు అక్కడి నివాసులు తమ ఇబ్బందులను వినిపించారు. రెండేండ్లైనా తమకు సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించక పోవడం వల్ల వర్షం వచ్చిన సమయాల్లో ఆ నీరంతా ఇండ్లలోంచి వెళ్తోందని శ్రీనివాస్‌కు వివరించారు. మురుగు కాలువల ఏర్పాటు లేకపోవడం వల్ల ఇండ్లలో వాడకనీరు ఇండ్ల ముందర చేరి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు అప్పగించి రెండేండ్లు దాటినా ఇంత వరకు పట్టాలు ఇవ్వలేదని వాపోయారు. అయినా ఇంటిపన్ను వసూలు చేస్తున్నారని శ్రీనివాస్‌కు తెలిపారు. సంబంధఙత కాంట్రాక్టర్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించి అప్పగించాలని నిబంధనలు ఉన్నా అవేమి లేకుండానే అప్పగించారన్నారు. రెండేండ్లకే స్లాబుకు చెమ్మ దిగుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వారితో మాట్లాడారు. కాలనీ వాసులు పడుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటకూరి వెంకటరావు, బొడ్డు మహేశ్, మంగయ్య, పార్వతి, బాలాజీ పాల్గొన్నారు.