Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో చిరుమర్రి గ్రామానికి చెందిన యడవల్లి సైదులు అనే యువకుడు రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయంపై అక్టోబర్ 28న నవతెలంగాణ దినపత్రికలో ''దాతల సహాయం కోసం ఎదురు చూపు'' అనే వార్తాకథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ఈవార్తాకథనాన్ని చూసి మానవీయ కోణంలో స్పందించిన దాతలు చిరుమర్రి గ్రామానికి చెందిన బండి వీణ, నున్నా క్రాంతి, బండి రచనలు కలిపి రూ ఒక లక్షా 15 వేల రూపాయలు, బండి సందీప్, రూ 50,000, బండి నవీన్ రూ10 వేలరూపాయలు తల్లిదండ్రుల సహకారంతో మొత్తం కలిపి ఒక లక్ష 75వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈసందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ సైదులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బండి రమేష్. దాతలు బండి వెంకటేశ్వరరావు, నున్నా అప్పారావు, బండి రవి, బండి శేఖర్, సిపిఐ (ఎం) నాయకులు కోలేటి ఉపేందర్, సామినేని రామారావు, ఉన్నం కోటేశ్వరరావు, సామినేని రాంబాబు, ఇనుకొండ రాణి, మోర రామ్మూర్తి నల్లగొండ ఎల్లేష్, చావగాని మాధవరావు, కత్రం గురవయ్య తదితరులు పాల్గొన్నారు.