Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
భవననిర్మాణ కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండో రోజున శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్వో శీరీషకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని రక్షించాలని, రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్నటువంటి రూ. 36 వేల కోట్లను వెంటనే నష్టపరిహారం చెల్లించాలనారు. 60 సంవత్సరాలు దాటిన అటువంటి వారికి బోర్డ్ నుండి నెలకు 60వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని, అడ్డాలకు స్థలాలు కేటాయించి మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇనుము, సిమెంట్ ధరలు తగ్గించాలని, ప్రధానమైనటు వంటి డిమాండ్లతో సమ్మె చేస్తున్నామని, దేశ వ్యాప్తంగా జరిగే ఈ సమ్మెలో అన్ని మండలాలు జిల్లా కేంద్రంలో కూడా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధోనోజు లక్ష్మయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమలపల్లి మోహన్రావు, మేడికొండ నాగేశ్వరరావు, ఎర్ర మల్లికార్జున్, టీవీ రమణ, అమరబోయిన లింగయ్య, విశ్వనాథన్, జంగం నగేష్, గూడా బ్రహ్మం, వశపొంగు వీరన్న తదితరులు పాల్గొన్నారు.