Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంప్రాంతీయప్రతినిధి
నగరంలో మరో సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ సముదాయానికి స్థలాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. నగర ప్రజల అవసరాలకనుగణంగా, జనాభా ప్రాతిపదికన వి.డి.ఓస్ కాలనీలో సమీకృత వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీరు ఆంజనేయ శర్మ, ఇ.ఇ కృష్ణలాల్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, తహశీల్దారు శైలజ, ఎక్సైజ్ సి.ఐ రాజు, ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు ఉన్నారు.