Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖానాపురం హవేలిలో ఉన్న చెరువుని సీపీఐ(ఎం) బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ చెరువుని స్వార్థపరశక్తులు గండి కొట్టి ఆ నీటిని బయటికి పంపించడం జరుగుతుందని పరిశీలనలో తేలిందన్నారు. ఈ చెరువు చుట్టుపక్కల ఉన్న ఖానాపురం గ్రామం, టేకులపల్లి, బాలాజీ నగర్, పాండురంగాపురం, జై నగర్ కాలనీ, టేకులపల్లిలో కొత్తగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఏరియా ప్రాంతంలో బోర్లలో గ్రౌండ్ వాటర్ లేవల్ తగ్గిపోకుండా ఈ చెరువు నీటి వసతిని కాపాడుతున్నదని, వేలాది మందికి ఈ చెరువు ఉపయోగపడుతుందని, ఈ చెరువు కొంత కొంతమంది స్వార్థపరుల కబ్జాకు గురి అయినదని పరిశీలనలో తేలిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ చెరువుకు గండికొట్టిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చెరువు వల్ల ఇప్పటికీ ఈ ప్రాంతాలలో కొత్తగా నిర్మాణాలు చేసుకుంటున్న వారికి ఉపయోగ పడుతున్నదని, అదే విధంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నదని, వారి అందరి ప్రయోజనాలకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై.విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్, ఎస్ నవీన్‌రెడ్డి, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీను, ఖానాపురం హవేలి మండల కమిటీ సభ్యులు తోట నాగరాజు, ఆనందరావు, నాగేశ్వరరావు, కే అమరావతి, కె నవీన్, కే పవన్, సీనియర్ నాయకులు బోడేపూడి వీరభద్రం, వేదగిరి మురహరి, డివైఎఫ్ఐ ఖానాపురం హవేలి అధ్యక్షులు బి వీర బాబు, ఖానాపురం యూత్ శాఖ సభ్యులు సాయి, మహేష్, వినోద్, ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు.