Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, మిర్చి తోట రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఎకరానికి 50 వేలు వెంటనే ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, సహాయ కార్యదర్శి మీరా డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో పింజరమడుగు గ్రామంలోని రైతులు సాగు చేసి నల్లి పురుగు, పచ్చ పురుగుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మిరప తోటల్లో నల్లి పురుగు, పచ్చ పురుగు చేరి పూర్తిగా పంటలు నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులతో సర్వే చేయించి రైతులకు ప్రభుత్వం 50వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను సమీకరించి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసి సంఘం రాష్ట్ర నాయకులు దుగ్గి కృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు వింజం నాగభూషణం, కాటినేని కృష్ణమూర్తి, ఉప్పతల వెంకన్న, కిన్నెర రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.