Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
అమరవీరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమలు నిర్వహిస్తామని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని గూడూరు పాడు గ్రామానికి చెందిన అమరజీవి పుచ్చకాయల వెంకటేశ్వర్లు 50వ వర్ధంతిని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో పొన్నం వెంకటరమణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ వర్ధంతి సభలో ప్రసాద్ మాట్లాడుతూ పుచ్చకాయ వెంకటేశ్వర్లు పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అన్నారు. గూడూరుపాడు ప్రాంతంలో సీపీఎంని విస్తరింపజేసేందుకు ఎనలేని కృషి చేశాడని కొనియాడారు. ఓర్వలేని కాంగ్రెస్ గూండాలు ఉద్యమాన్ని అణిచేందుకు వెంకటేశ్వర్లును హత్య చేశారని తెలిపారు. వెంకటేశ్వర్లు ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని కోరారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు. ఈ సభలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు పుచ్చకాయల నాగేశ్వరరావు, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్‌రావు, తాటి వెంకటేశ్వర్లు, వడ్లమూడి నాగేశ్వరరావు, ఏపూరి వరకుమార్, కుక్కల సైదులు, పసుపులేటి సత్యనారాయణ, మల్లయ్య, కొత్తకొండ సత్యం తదితరులు పాల్గొన్నారు.