Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఇటీవల ఖమ్మంలో జరిగిన పార్టీ జిల్లా మహాసభలలో జిల్లా అభివృద్ధి కోసం అనేక ప్రజా ఉపయోగ తీర్మానాలు చేయడం జరిగిందని, ఈ తీర్మానాల అమలు కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ అన్నారు. స్థానిక సిపిఎం త్రీటౌన్ కార్యాలయంలో పత్తిపాక నాగసులోచన అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ కాంత్ మాట్లాడుతూ జిల్లాతో పాటు త్రీ టౌన్‌లోని ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. వీటిలో మున్నేటికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేయాలని, సారధి నగర్ అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం చేయాలని, గ్రీన్ బెల్ట్ ఎత్తి వేసి ఇండ్ల నిర్మాణంకు అనుమతి ఇవ్వాలని, ప్రకాష్ నగర్, శ్రీనివాస నగర్, 31వ డివిజన్లో కాల్వకట్ట పై నివసించే వారికి స్థానికంగా పట్టాలు ఇవ్వాలని, త్రీ టౌన్ లో మినీ స్టేడియం నిర్మాణం చేయాలని మరియు అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు, 55 సంవత్సరాలకే పెన్షన్ హామీ అమలు, నిరుద్యోగ భృతి ఇతర అనేక డిమాండ్ ల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, నాయకులు బండారు యాకయ్య, తుశాకుల లింగయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, యస్‌కె సైదులు, బండారు వీరబాబు, శీలం వీరబాబు, కమిటీ సభ్యులు మద్ది సత్యం, అంకిత వెంకన్న, యస్ కె బాబు, పాశం సత్యనారాయణ, మేకల శ్రీనివాసరావు, వేల్పుల నాగేశ్వర రావు, రంగు హనుమంత చారి, గబ్బెటి పుల్లయ్య, సారంగి పాపారావు, కొట్టె అలివేలు మరియు శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.