Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ప్రపంచ దేశల చరిత్రలలో ఆకలి, దరిద్రంలో భారతదేశం 101స్థానంలో ఉన్నదని ప్రపంచ ఆకలి సూచిక సంస్థ సర్వేలో తేల్చిచెప్పిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో సిపిఐ(ఎం) మండల విస్తృతస్థాయి సమావేశం ఆ పార్టీ మండల నాయకులు యండ్రాపల్లి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ఆకలి సూచిక సంస్థ 116 దేశాల్లో సర్వే నిర్వహించిందన్నారు .దేశంలో 40 శాతం మంది ప్రజలు పేదరికంతో ఆలమటస్తున్నారని నీతి అయోగ్ సర్వేలో తేలిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నుండి భూమి వేరుచేసి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే చెప్పేందుకు ప్రధానమంత్రి మోడీ కుట్ర పన్నుతున్నారన్నారు. మోడీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరకాలంపాటు ఉద్యమం చేసి భారత రైతాంగం విజయం సాధించిందన్నారు. పోరాడితే విజయం తథ్యమని,. భవిష్యత్ పోరాటాలకు రైతులఉద్యమం గొప్ప సంకేతం ఇచ్చిందన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతూ దేశ,రాష్ట్ర సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులు అనుకూల విధానాలను అనుసరిస్తూ ఉన్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లక్షల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే సంవత్సరంలో రాష్ట్ర సిపిఐ(ఎం) మహాసభలు జరగనున్నాయని, ఆ మహాసభల జయప్రదంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు .ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపటనాటకాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. పార్లమెంటు సమావేశాలలో రైతుల పంటలకు కనీస మద్దతు ధరచట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో దోస్త్ గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా క్రీడలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల బలోపేతంతో పాటు పార్టీ అభివృద్ధికి కృషి జరగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు మాని ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలన్నారు. వరి వేయొద్దని ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి జలాశయాలు నిర్మించడం దేనికి అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా నాయకులు బండి పద్మ,, వాసిరెడ్డి వరప్రసాద్, పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వర్లు, పార్టీ మండల నాయకులు టిఎస్ కళ్యాణ్, ఇరుకు నాగేశ్వరరావు, మందరపు వెంకన్న, పద్మ, మంకెన దామోదర్, రాయల శ్రీనివాసరావు, కందుల భాస్కరరావు, కందిమల్ల తిరుపతి, పయ్యావుల ప్రభావతి, వేల్పుల భద్రయ్య, కోలేటి ఉపేందర్, పి. రాంబాబు, బట్టు రాజు, మెట్టెల సతీష్, కట్టకూరు ఉపేందర్, పయ్యావుల పుల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోలేటి అరుణ, పార్టీ నాయకులు బండి శేఖర్, సామినేని రామారావు, బొడ్డు శ్రీను, ఇలాసాగరపు సత్యం, ,పుచ్చకాయల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.