Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ 137వ జయంతి ఘనంగా శుక్రవారం నిర్వహించారు. తొలుత అయన చిత్ర పటానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావీద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన చురుకుగా పాల్గొన్నారన్నారు. 1950 లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత, రాజ్యాంగ పరిషత్ ద్వారా భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారనారు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి భారత పార్లమెంట్ ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారని. రాష్ట్రపతిగా వారు పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకు రాజకీయాల నుండి వైదొలిగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పారనారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, ఓ.బి.సి. సెల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు వడ్డె నారాయణరావు, మద్ది వీరారెడ్డి, సయ్యద్ హుస్సేన్ , పల్లెబోయిన చంద్రం , పెండ్ర అంజయ్య, కందుకూరి వెంకటనారాయణ, తలారి నాగభూషణం , దొబ్బల నరేష్ , గడ్డం వెంకటయ్య, మహమూద్రు పాల్గొన్నారు