Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నివాళ్లర్పించిన పలువురు నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ తండ్రి రాపర్తి హనుమంతరావు శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ, ఎస్బిఐ, ఆర్.జె.సి.విద్యా సంస్థల అధినేత గుండాల(ఆర్జేసీ)కృష్ణ హుటాహుటిన శరత్ ఇంటికి వెళ్లి హనుమంతరావు భౌతికకాయాన్ని సందర్షించి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాపర్తి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు.అందరితో కలివిడిగా ఉంటూ అందరి తలలో నాలుకలా మెదిలే హనుమంతారావు మరణం తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.