Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ఎక్కడో వేల కిలోమీటర్ల సుదూర ప్రాంతమైన మధ్యప్రదేశ్ నుండి పొట్ట చేత పట్టుకొని వచ్చి రోడ్డు పక్కనే నివాసాలు ఏర్పాటు చేసుకొని కమ్మరి పని చేసేవారు ''పని ఉంటే మస్తు... లేకుంటే పస్తు'' అంటూ వాపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ ఇళ్ల వద్ద ఉంచి పిల్లలను సైతం తీసుకొని తెలంగాణకు వచ్చి కమ్మరి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే స్థానికంగా దొరికే ముడిసరుకు తోనే గొడ్డలి, కత్తులు రైతాంగానికి ఉపయోగపడే కొడవలి, చేతి కత్తులు తయారు చేసి వాటితో వచ్చిన పైసలను రోటి, భోజనం చేయడం జరుగుతుందని తెలుపుతున్నారు. ఒక్కొక్క రోజు రూ.15 నుంచి 2000 కూడా అమ్మకాలు జరుగుతాయని ఒకరోజు కేవలం రెండు వందల నుంచి ఐదు వందల వరకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయని వారు తెలిపారు. తమ ప్రాంతంలో జీవనాధారం సరిగా లేకపోవడం వల్లనే ఇలా ఇతర ఇతర రాష్ట్రాలకు వచ్చి చేతి వృత్తులు చేసుకొని బతుకు పోరాటం చేస్తున్నామని వారు తెలిపారు.
రెక్కాడితే కాని డొక్కాడని దయనీయ దుస్థితి : నిత్యం పని ఉండి రికార్డు అనే కానీ డొక్కాడదని వారు నవతెలంగాణ ముందు ఆందోళన చెందారు. తమ గ్రామాల్లో సైతం పూర్వీకులు సంపాదించిన ఆస్తులు లేవని కాయకష్టం చేసుకుని జీవనం సాగించాలని దుస్థితి ఉందని వారు తెలిపారు.
రోడ్డు పక్కనే నివాసాలు...అవే వారి ఇంద్ర భవనాలు : మండల కేంద్రాల్లోనూ, గ్రామాల్లోనూ రోడ్లపైకి నే నివాసం ఉంటూ ఎండా ,వాన, గడగడా వణికే చలిని సైతం లెక్కచేయకుండా జీవిస్తూ వారి జీవన ఉపాధి కమ్మరి పనిని శ్రద్ధగా చేస్తూ రోడ్డు పక్కన నివాసాలను ఇంద్ర భవనాలు గా తలుచుకుంటూ జీవనం సాగిస్తు న్నారు. కరోనా కారణంగా తమ తమ పిల్లలు సైతం తమ వెంటే ఉన్నారని ఈ మధ్యన పిల్లలందరినీ సొంత గ్రామాలకు పంపిస్తామని వారు తెలిపారు . హౌలీ పండుగ వెళ్లే వరకు ఇతర రాష్ట్రాలలో ఆయా గ్రామాల్లో కమ్మరి పని చేసుకొని జీవన ఉపాధి కల్పిస్తా మని హౌ లీ పండగ ముగిసిన తర్వాత తమ తమ ఇళ్లకు వెళ్దామని వారు తెలిపారు. ఇటువంటి చేతివృత్తుల వారికి ప్రభుత్వాలు చేయూతనిచ్చి కావాలని కోరుకుందాం