Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చొరవ చూపిన డీవైఎఫ్ఐ
నవతెలంగాణ-కారేపల్లి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు ఇవ్వక కనీస వసతులు కల్పించలేని స్ధితిలో ఉన్నాయి. కారేపల్లి జూనియర్ కళాశాలలో తాగునీటి సౌకర్యం లేక కళాశాల విద్యార్ధులు ఇబ్బందులు పడుతు న్నారు. ఈవిషయాన్ని గుర్తించిన డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ చింతల రమేష్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు అమరజీవి రాయపూడి సర్వేశ్వరరావు కుమారుడైన సీపీఐ(ఎం) నాయకులు రాయపుడి సాయిబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సాయిబాబు కళాశాలకు మిషన్ భగీరధ నీటిని రప్పించటానికి అవసరమైన పైప్ లైన్, ఇతన సామాగ్రీని ప్రిన్సిపాల్ మీటకోటి సింహాచలంకు అందజేశారు. నీటి సౌకర్యం కోసం వితరణ చేసిన దాతను ప్రిన్సిపాల్ సింహాచలం, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్‌లు అభినందించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు దారావత్ రవికుమార్, అంగిరేకుల సతీష్, వంశీ, సాగర్, రఫీ, సత్య, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జయప్రకాశ్, అధ్యాపకులు సుమమానిళిని, మోహన్, పార్ధసారధి పాల్గొన్నారు.