Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని నెల్లిపాక బంజర గ్రామంలో ఖైల్ట్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ పర్యవేక్షకుడు రాము మాట్లాడుతూ హెచ్ఐవి సుఖ వ్యాధులు గురించి వివరించారు. అదేవిధంగా గర్భిణీలకు రక్త పరీక్షల గురించి వివరించారు. హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచు గొర్రె ముచ్చు వెంకటరమణ, కార్యదర్శి రామ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు, లింక్ వర్కర్ వినుతావళి పాల్గొన్నారు.