Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీడీపీ నేత ముద్రగడ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో ముఖ్యమైన గోవా ముఖ్యమైనది. ఇప్పుడున్న పరిస్థితిలో ఓమిక్రాన్ అనే కొత్త కరోనా వేరెంట్ దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధులను గోవాకు తరలించింది. గోవకు వెళ్లినా ప్రజా ప్రతినిధులను టెస్ట్లు చేసిన తరువాతనే వారి స్వస్థలలకి పంపించాలని తెలుగుదేశం పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, ఇల్లందు పట్టణ అధ్యక్షులు ముద్రగడ వంశీ ప్రభుత్వని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనునా ప్రజా ప్రతినిధులను (మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు) ,అధికార తెరాస పార్టీ గోవాకు క్యాంపుకు తరలించారన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత తీసుకొని ఆదర్శంగా ఉండాలన్నారు.