Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐకమత్యంతో ముందుకు సాగుదాం.. రజక సంఘం నాయకులు పిలుపు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం గొల్లగూడెం చెరుకూరి తోటలో ఆదివారం నాడు రజక సంఘం ఆధ్వర్యంలో రజక వన సమారాధన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. తొలుత రజకుల ఆరాధ్యదైవం మాడెలయ్య స్వామికి పూజలు చేశారు. అనంతరం పోరాటాయోధురాలు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ వనసమారాధన కార్యక్రమంలో 10 వేలమంది రజకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య మాట్లాడుతూ రజకులు సామాజికాంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు. ముది గొండ సొసైటీ అధ్యక్షులు తుపాకుల ఎలగొండ స్వామి మాట్లాడుతూ రజకులు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వహణ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు పంతంగి వెంకటేశ్వర్లు, నిర్వహణ కమిటీ సభ్యులు కణతాల నరసింహారావు, జక్కుల వెంకటరమణ, గూడెపు నాగరాజు, తమ్మారపు బ్రమ్మం,రేగళ్ల కొండల్, కాండ్రాతి వెంకటేశ్వర్లు, మణిగా కోటేశ్వరరావు, జబర్దస్త్ కళాకారిణి యోధ సిస్టర్స్, రాజు బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.