Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమంలో
పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని రామాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన కుంకుమ అర్చన కార్యక్రమంలో సామూహిక వనభోజనాల కార్యక్రమంలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా రామాపురం గ్రామంలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కలిసి సామూహిక వనభోజనాలను ఏర్పాటు చేశారు. ఈ వనభోజనాల, కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ కలసిమెలసి జీవించాలని కోరారు. రాజకీయాలు కేవలం ఓట్ల సమయం లోనే ఉండాలని, మిగిలిన సమయంలో ప్రజలందరూ ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటూ కలిసిమెలిసి జీవించాలని సూచించారు. అనంతరం రామాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయ అర్చకులు, గుడి చైర్మన్ ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వారు శాలువాతో ఘనంగా సత్కరించారు. రామాలయం అభివృద్ధిలో భాగంగా తన వంతు గా లక్ష రూపాయలను అందజేశారు. కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న వారిని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తొండపు వేణు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్యచ బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్, రామాలయ చైర్మన్ బంధం అచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు సండ్ర కిరణ్, ఉమ్మనేని కృష్ణ, సాధినేని రాంబాబు, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, నల్లిబోయిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తల్లాడ : మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన నాగేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్టా దయానంద్, సర్పంచ్ కామెడీ విద్యాసాగర్‌రావు, పుట్టేటి బ్రహ్మారెడ్డి ఇ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి బాసట
కారేపల్లి : కేసముద్రంలోని బాయిల్డ్ రైస్‌మిల్లులో ట్రాక్టర్ డోజర్ డ్రైవర్‌గా పని చేస్తూ ప్రమాదావశాత్తు నిప్పంటుకోని మృతి చెందిన కారేపల్లి మండలం మాధారంకు చెందిన కుమ్మరికుంట్ల ప్రసాద్ కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాసటగా నిలిచారు. రైల్ మిల్లులో పనిచేస్తూ మృతి ప్రసాద్ విషయాన్ని మాధారం సర్పంచ్ అజ్మీర నరేష్, ఎన్డీ నాయకులు కుర్ర శ్రీనివాసరావు, కోయల శ్రీనివాసరావు, రజక సంఘం రాష్ట్ర నాయకులురాలు శ్రీలక్ష్మి లు మాజీ ఎంపీ పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పొంగులేటి బాయిల్డ్ రైస్ మిల్లు యాజమానితో చర్చించి తక్షణ సహాయంగా కుటుంబానికి రూ.2.50 లక్షలు అందేలా చేశారు. దీనితో పాటు వాహన ప్రమాద భీమా క్రింద రూ.10లక్షలు వర్తింపజేసేలా మాజీ ఎంపీ కృషి చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రసాద్‌కు నివాళ్ళు ఆర్పించిన నాయకులు
బాయిల్డ్ రైస్ మిల్లులో నిప్పంటుకోని మృతి చెందిన మాధారం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల ప్రసాద్ మృతదేహాన్ని సర్పంచ్ అజ్మీర నరేష్, ఉపసర్పంచ్ భాగం వెంకటప్పారావు, ఎన్డీ మండల కార్యదర్శి వై.ప్రకాశ్, నాయకులు కోయిల శ్రీనివాసరావు,కుర్ర శ్రీనివాస్, గడ్డం వెంకన్న, గ్రామపెద్దంలు బందేలి, వేములపల్లి, వీరన్న, రమేష్, వెంకన్నలు సందర్శించి నివాళ్ళు ఆర్పించారు.
పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న పొంగులేటి
కొణిజర్ల: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు శుభకార్యాలకు హాజరై నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అమరగాని వెంకన్న, చిత్తాలురి నరసయ్య, కేసరి వెంకట రెడ్డి, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు, ఏలూరి శ్రీనివాసరావు,దరావత్ రాంబాబు, వైరా మార్కెట్ డైరెక్టర్లు తాళ్లూరి చిన్న పుల్లయ్య,దరావత్ బాబులాల్, సురభి వెంకటప్పయ్య, మండల నాయకులు వింజం పిచ్చయ్య పాల్గొన్నారు.