Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలోని అనంతోగు గ్రామం ఆశ్రమ గిరిజన కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో కరోనా కేసులు నమోదు కావడంతో విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. సోమవారం పాఠశాలలోని 169 మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సాగర్ మంగళవారం వెల్లడించారు. స్వీయ నియంత్రణ పాటించాలని వారి తల్లిదండ్రులకు సూచించామన్నారు.